మావోయిస్టుల కంచుకోటలో ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

by GSrikanth |
మావోయిస్టుల కంచుకోటలో ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల కంచుకోటలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల సంపదను లూటీ చేసిందని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన నేతలు ఎవరినీ వదిలిపెట్టబోము అని.. అవినీతిపరులందరూ చట్ట పరంగా శిక్ష అనుభవిస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం లీగ్ ప్రేరణతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేశారని విమర్శించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. ఈ మేరకు ప్రధానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం మేనిఫెస్టోలా ఉంందన్న మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story