- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాచల్ ప్రదేశ్‌లో పతనం అంచున కాంగ్రెస్ సర్కార్
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరింది. రేపు సీఎం సుఖ్విందర్ సింగ్ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకైక రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు 34 చొప్పున ఓట్లు పడ్డాయి.
డ్రాలో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి హర్షమహాజన్ విజయం సాధించారు. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుఖ్విందర్ సింగ్ సర్కార్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇది గమనించిన బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పోలింగ్‌కు ముందే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని బీజేపీ నేతలు చెప్పడం దుమారం రేపింది.