Congress: ఢిల్లీలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి సీనియర్ నేత మతీన్ అహ్మద్ రిజైన్

by vinod kumar |
Congress: ఢిల్లీలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి సీనియర్ నేత మతీన్ అహ్మద్ రిజైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ(Congress party)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి మతీన్ అహ్మద్ (Chowdary mathin ahmad) కాంగ్రెస్‌కు రిజైన్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ(Aap)లో చేరారు. ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Aravindh Kejriwal) సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు గత నెల 29న అహ్మద్ కుమారుడు జుబేర్ అహ్మద్(Jubair ahmadh) ,కోడలు షగుఫ్తా చౌదరి(Faguftha Chowdary)లు ఆప్‌లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మతీన్ సైతం కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేరడం గమనార్హం. కాగా, మతీన్ కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోని సీలంపూర్ (Seelampoor) నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993 నుంచి 2013 వరకు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టు అయింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ మతీన్ అహ్మద్ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed