సీబీఐ చేతికి కోల్‌కతా వైద్యురాలి లైంగిక దాడి కేసు

by M.Rajitha |
సీబీఐ చేతికి కోల్‌కతా వైద్యురాలి లైంగిక దాడి కేసు
X

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి లైంగిక దాడి కేసు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వైద్యురాలిది అసహజ మరణమని వ్యాఖ్యానించిన కోర్ట్.. కేసు నమోదు విషయంలో ఎందుకు జాప్యం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ కేసులో ఆర్జీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని హైకోర్ట్ స్పష్టం చేసింది. కాలేజీ ప్రిన్సిపాల్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మరో కాలేజీకి ఎలా ప్రిన్సిపాల్ గా నియామిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని కోర్ట్ ప్రశ్నించింది. వెంటనే ప్రిన్సిపాల్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని లేదంటే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆర్జీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ మాట్లాడుతూ.. చనిపోయిన వైద్యురాలు తనకు కూతురితో సమానమని, ఈ ఘటనా సమాచారం తెలిసిన వెంటనే తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. కొందరు కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ కోణంలో ఈ ఘటనను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed