Yogi Adityanath : క్రికెట్ ఆడిన సీఎం యోగి ఆదిత్యనాథ్

by karthikeya |   ( Updated:2024-10-07 04:56:17.0  )
Yogi Adityanath : క్రికెట్ ఆడిన సీఎం యోగి ఆదిత్యనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రికెటర్ అవతారం ఎత్తారు. బ్యాట్ పట్టుకుని బంతిని బౌండరీలు దాటించారు. ఏంటి నమ్మడం లేదా..? కావాలంటే ఈ కింది వీడియో చూడండి. విషయం ఏంటంటే.. 36వ ఆల్ ఇండియా అడ్వొకేట్ క్రికెట్ టోర్నమెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలను యూపీ ప్రభుత్వం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా.. సీఎం యోగి క్రికెట్ ఆడుతూ బంతిని బాదుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాసాగాయి. ఈ వీడియోలో కాషాయ వస్త్రాలు ధరించి బ్యాట్ పట్టుకుని బంతిని ఎడాపెడా బాదేస్తున్న యోగి.. బౌలర్ వైపు చూసి నవ్వుతూ కనిపించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో భారత్‌లో క్రీడలపై మక్కువ పెరిగిందని, దానికి తగ్గట్లు దేశంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచడంపైనే పీఎం మోడీ కూడా దృష్టి సారిస్తున్నారని చెప్పారు. దీనివల్ల మారుమూల గ్రామాలకు చెందిన యువత కూడా క్రీడల్లో ముందడుగు వేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ వంటి కార్యక్రమాలతో భారత్‌లో కొత్త క్రీడా విధానం మొదలైందని ఆయనన్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కూడా ఇలానే ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొన్న యోగి అక్కడ చెస్ ఆడి అందరినీ అలరించారు. వరల్డ్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్, దేశపు ఉత్తమ చెప్ ప్లేయర్ కుశాగ్ర అగర్వాల్‌తో ఆయన పోటీపడ్డారు.


Advertisement

Next Story