Cm stalin: తమిళనాడు అభివృద్ధిని గవర్నర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.. సీఎం స్టాలిన్ ఫైర్

by vinod kumar |
Cm stalin: తమిళనాడు అభివృద్ధిని గవర్నర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.. సీఎం స్టాలిన్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు (Thamilnadu) అభివృద్ధిని చూసి గవర్నర్ ఆర్ఎన్ రవి (Rn ravi) జీర్ణించుకోలేక పోతున్నారని సీఎం స్టాలిన్ (Cm stalin) విమర్శించారు. అసెంబ్లీలో ప్రసంగించకుండా ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ఆయన మాట్లాడారు. శాసనసభలో మాట్లాడకుండా గవర్నర్ తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని తలపించిందని అభివర్ణించారు. గవర్నర్‌గా రవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నేళ్లుగా రాష్ట్ర అసెంబ్లీలో విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం.. సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నేను సాధారణ వ్యక్తినే కావచ్చు కానీ కోట్లాది మంది ప్రజల మనోభావాల వల్లే రాష్ట్ర శాసనసభ ఉనికిలోకి వచ్చిందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గవర్నర్ తప్పుడు దోరణితో వెళ్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈనెల 6న గవర్నర్ రవి సభలో ప్రసంగించాల్సి ఉండగా..మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే జాతీయ గీతం ప్లే చేయకపోవడంతో అసంతృప్తితో వెళ్లిపోయానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed