- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం: సీఎం ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18వ తేదీ నుంచి ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చెన్నై సహా 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఈ క్రమంలోనే వర్షాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్.. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో వర్షాలు, సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు. ముఖ్యంగా రాజధాని చెన్నైలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో విద్యాసంస్థలకు మంగళవారం నాడు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే రేపటి నుంచి 18వ తేదీ వరకు ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఆయా సంస్థల యాజమాన్యాలకు ఆల్టిమేటం జారీ చేశారు.