- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Siddaramaiah: త్వరలోనే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి కేంద్రంలో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అధికార ఎన్డీఏ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయబోదన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండలేదని జోస్యం చెప్పారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ‘ కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే నితీశ్, చంద్రబాబు నాయుడుల మద్దతుతో మోడీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఏ క్షణంలోనైనా వారు మద్దతు ఉపసంహరించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో తన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ..224 మంది ఎమ్మెల్యేలకు గాను తమకు 136 మంది శాసనసభ్యులు ఉన్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలా పడిపోతుందని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రజాదరణను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీని జీర్ణించుకోలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.