నాకు రోజూ ఆ ఇంజెక్షన్లు కావాలి.. తీహార్ జైలు అధికారులకు CM కేజ్రీవాల్ లేఖ

by GSrikanth |
నాకు రోజూ ఆ ఇంజెక్షన్లు కావాలి.. తీహార్ జైలు అధికారులకు CM కేజ్రీవాల్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. తనకు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు కావాలని లేఖలో రిక్వెస్ట్ చేశారు. అయితే.. ఇన్సులిన్ ఇవ్వకుండా, తన వైద్యుడితో సంప్రదింపులకు అవకాశం కల్పించకుండా కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జైలు అధికారులపై ఆరోపణలు చేసింది. మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

తనకు ఇన్సులిన్ ఇవ్వాలని, ఫ్యామిలీ డాక్టర్‌ను వీడియో కాల్‌లో సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను జైలు యంత్రాంగం తిరస్కరించిందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. గత 22 ఏళ్లుగా కేజ్రీవాల్‌ మధుమేహంతో బాధపడుతున్నారని చెప్పారు. మరోవైపు అరెస్ట్ చేయడానికి కొన్ని నెలల ముందే కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని జైలు అధికారులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మధుమేహానికి నోటి నుంచే మందులు వాడుతున్నారని చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story