Places of Worship Act : ‘ప్రార్ధనా స్థలాల’ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. 12న సుప్రీంకోర్టులో విచారణ

by Hajipasha |
Places of Worship Act : ‘ప్రార్ధనా స్థలాల’ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. 12న  సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991’ని(Places of Worship Act) సవాల్ చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) సారథ్యంలోని ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, కె.వి.విశ్వనాథ్ సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై డిసెంబరు 12న (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

ప్రాచీన మసీదులు, దర్గాల కింద ఆలయాలు ఉన్నాయని ఆరోపిస్తూ, వాటిని సర్వే చేయాలంటూ ఇటీవలే పలుచోట్ల హిందూపక్షాలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ‘ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991’ ప్రకారం ప్రాచీన మసీదులు, దర్గాల ఉనికిని సవాల్ చేయడం సరికాదని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. ‘ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991’ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక పార్టీగా చేర్చారు. ఈనేపథ్యంలో డిసెంబరు 12న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Next Story

Most Viewed