CJI Chandrachud: సమాజం పితృస్వామ్య వైఖరిని విడనాడాలి.. సీజేఐ చంద్రచూడ్

by vinod kumar |
CJI Chandrachud: సమాజం పితృస్వామ్య వైఖరిని విడనాడాలి.. సీజేఐ చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత సమాజం పితృస్వామ్య మనస్తత్వాన్ని విడనాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. సోమవారం ఆయన ఓ మీడియా చానల్ నిర్వహించిన షీ శక్తి ఈవెంట్‌లో మాట్లాడారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి చట్టపరమైన నిబంధనలకు కొరత లేదని, అయితే ఈ కఠినమైన చట్టాల వల్ల మాత్రమే సమాజం మారబోదని వెల్లడించారు. ఆలోచనా ధోరణులు మారినప్పుడే మెరుగైన సమాజం నిర్మాణమవుతుందని నొక్కి చెప్పారు. మనస్తత్వాలు మారినప్పుడే మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం లభిస్తుందని తెలిపారు. మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం చాలా ముఖ్యమని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. కొన్ని గొప్ప జీవిత పాఠాలను తన మహిళా సహోద్యోగుల నుంచి నేర్చుకున్నట్టు తెలిపారు. భారత దేశ హక్కులను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారు అన్ని రంగాల్లో రాణించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed