అక్రమంగా భారత్‌లో ఉంటూ ఎన్నికల్లో ఓటు వేసిన బంగ్లాదేశ్ పౌరులు

by Harish |   ( Updated:2024-06-11 14:14:53.0  )
అక్రమంగా భారత్‌లో ఉంటూ ఎన్నికల్లో ఓటు వేసిన బంగ్లాదేశ్ పౌరులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడంతో పాటు నకిలీ పత్రాలతో ముంబైలో నివసిస్తూ, ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన నలుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) మంగళవారం తెలిపింది. నిందితులు.. రూబెల్ హొస్సేన్ షేక్ (33), సుల్తాన్ మహమూద్ షేక్ (46), హఫీజుర్ రెహమాన్ షేక్ (36), ఫఖ్రుల్ ఉద్దీన్ షేక్ (29)లుగా గుర్తించారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా ఈ విధంగా భారత్‌లో ఉన్నట్లు సమాచారం. వారు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని కనిపెట్టే పనిలో అధికారులు ఉన్నారు.

ఈ బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి నకిలీ పౌరసత్వ పత్రాల ఆధారంగా నకిలీ ఓటరు ఐడీ కార్డులు పొంది, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. మోసపూరితంగా భారతీయ పాస్‌పోర్ట్‌లను పొందినందుకు బంగ్లాదేశ్ పౌరులను పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు. నిందితులను మజ్‌గావ్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వారి సహచరులు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల వివరాలను కనిపెట్టడానికి అధికారులు తదుపరి విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed