- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంగనను కొట్టిన కానిస్టేబుల్‌కు రైతు సంఘాల మద్దతు
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను రైతు సంఘాల నాయకులు సమర్థించారు. ఎస్కేఎం (నాన్ పొలిటికల్) నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఇందుకోసం పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్‌ను కలవాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పోలీసులపై మరింత ఒత్తిడి పెంచేందుకు జూన్ 9 న మొహాలీలో ఇన్సాఫ్ మార్చ్ ( న్యాయం కోసం ర్యాలీ) చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మహిళా కానిస్టేబుల్‌కు ఈ కేసులో అన్యాయం జరగకూడదని డిమాండ్ చేయడానికి డీజీపీ ఆఫీసు వరకు ఈ మార్చ్ చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఇకపోతే, ఈ కేసులో నిందితురాలు కుల్విందర్ కౌర్ ను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ సస్పెండ్ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.
కంగనాకు రైతు సంఘాల మద్దతు
కుల్విందర్ కౌర్ సోదరుడు, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి షేర్ సింగ్ మహివాల్ ఆమెకు మద్దతుగా నిలిచారు. చండీగఢ్ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన మీడియా ద్వారా తనకు తెల్సిందన్నారు. కంగనా మొబైల్, పర్సు తనిఖీ చేసే సమయంలో ఆమెపై దాడి జరిగిందని అర్థమైందన్నారు. మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు గతంలో కంగనా చేసిన కామెంట్లను గుర్తు చేశారు. గతంలో కంగనా చేసిన వ్యాఖ్యలపై తన సోదరి చాలా ఆక్రోషంతో ఉందన్నారు. దానికి ప్రతిఫలమే కంగనాపై చెంపదెబ్బ అని పేర్కొన్నారు. దేశానికి రైతులు, సైనికులు ఇద్దరూ ముఖ్యమైనవారని అన్నారు. అన్ని విధాలుగా రైతులు, సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కుల్విందర్ కు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
మహిళా కానిస్టేబుల్ కు రూ.లక్ష రివార్డు
మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను పంజాబ్‌కు చెందిన వ్యాపారి సైతం సమర్థించారు. మొహాలీలోని జిరాక్‌పూర్‌కు చెందిన వ్యాపారి శివరాజ్ సింగ్ బెయిన్స్ ఆమెకు లక్ష రివార్డు ప్రకటించాడు. పంజాబీ ప్రజలు, పంజాబీ సంస్కృతిని రక్షించిన కుల్విందర్ కౌర్ అని.. ఆమెకు ఆయన సెల్యూట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దాడిపై సోషల్ మీడియాలో కంగనా పోస్టు
మరోవైపు, తనపై జరిగిన దాడి గురించి సోషల్ మీడియాలో కంగనా స్పందించారు. ఒకరిపై జరిగిన దాడిని మీరు వేడుక చేసుకుంటే.. అదే ఘటన మీకూ ఎదురు కావచ్చని పేర్కొన్నారు. అప్పుడు ప్రజల వాక్ స్వాతంత్ర్యం కోసం తాను పోరాడుతున్నానని గుర్తిస్తారన్నారు. అయితే, కొద్దిసేపటి తర్వాత ఆ పోస్టును కంగనా డిలీట్ చేశారు.
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ స్పందన ఇదే
కాగా, కంగనాపై దాడి విషయంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించారు. తాను ఎప్పుడూ హింసను సమర్థించనని పేర్కొన్నారు. కానీ, సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని అర్థం చేసుకోగలనని స్పష్టం చేశారు. కుల్విందర్ కౌర్ పై చర్యలు తీసుకుంటే.. తాను ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు. ఆమె ఉద్యోగం పోతే తాను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని పేర్కొన్నారు. జైహింద్.. జై జవాన్ – జై కిసాన్ అంటూ విశాల్ దద్లానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రాసుకొచ్చారు.