షాజహాన్‌ను ప్రశ్నించే ధైర్యం సీఐడీ చేస్తుందా?.. కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్

by S Gopi |
షాజహాన్‌ను ప్రశ్నించే ధైర్యం సీఐడీ చేస్తుందా?.. కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ బెంగాల్ సీఐడీకి సహకరించడంలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐడీ అధికారులు తృణమూల్ పార్టీకి బలమైన షేక్ షాజహాన్‌ని బలవంతంగా ప్రశ్నిస్తే ప్రాణాలు కోల్పోవచ్చని అన్నారు. 'తృణమూల్ పార్టీ సీఐడీని బానిసగా మార్చుకుంది. అలాంటిది సీఐడీ షాజహాన్‌ను ఎలా ప్రశ్నిస్తుంది? బానిసకు మాస్టర్ సమాధానం ఇస్తారా? షాజహాన్ వారికి యజమాని. అతన్ని ప్రశ్నిస్తే వారు తమ ప్రాణాలు కోల్పోతారు. వారు తమ ఉద్యోగాలను రిస్క్ చేయాలనుకుంటారా?' అని అధిర్ రంజన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకు పడ్డ అధిర్ రంజన్, షాజహాన్ ఎన్నికల వరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడానికే అరెస్ట్ చేశారన్నారు. సీఐడీ అతనికి మటన్, పులావ్, బిర్యానీ పెడతారు. వాటికి సమాధానం ఇవ్వడానికి అతను అక్కడికి వెళ్లాడా? అతను విశ్రాంతి కోసమే వెళ్లాడు. దీదీ(మమతా బెనర్జీ) అతన్ని విశ్రాంతి తీసుకోమని అడిగారు. ఎన్నికలు వచ్చాక అతను తిరిగి రావొచ్చు, అప్పుడే యాక్షన్‌లోకి దిగుతాడని అధిర్ రంజన్ పేర్కొన్నారు. షాజహాన్ కొంతకాలం జైలు నుంచే పనిచేస్తాడని, అక్కడి నుంచి ఎన్నికల వ్యూహాన్ని రచిస్తాడని ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story