క్రిస్మస్ స్పెషల్ ఫొటో.. ఆకట్టుకుంటున్న శాంటాక్లాజ్

by GSrikanth |
క్రిస్మస్ స్పెషల్ ఫొటో.. ఆకట్టుకుంటున్న శాంటాక్లాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు.

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన మెదక్‌ చర్చ్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ వేళ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ఉల్లిపాయలను ఉపయోగించి శాంటాక్లాజ్ ఇసుక చిత్రాన్ని చేశారు. ‘గిఫ్ట్ ఏ ప్లాంట్, గ్రీన్ ద ఎర్త్’ అన్న సందేశంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో చిత్రాన్ని వేశాడు. ఇది అందరినీ ఆకట్టుకుంటున్నది.

Advertisement

Next Story