- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాల్దీవుల్లోకి చైనా నౌక: భారత్‌తో విభేదాల వేళ కీలక పరిణామం
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవులకు మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఓ రీసెర్చ్ నౌక మాల్దీవులు జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలే తీరంలో ఇది తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. సుమారు 4,300 టన్నుల బరువున్న జియాంగ్ యాంగ్ హాంగ్ 3 అనే నౌక భౌగోళికంగా ముఖ్యమైన హిందూ మహాసముద్రంలో పరిశోధనను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ నౌక చైనాలోని థర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందినదిగా భావిస్తున్నారు. సముద్రగర్భంలో మ్యాపింగ్, ఖనిజాల అన్వేషణకు దీనిని ఉపయోగించనున్నారు. ఇది నెల రోజుల క్రితం చైనాలోని సన్యా నుంచి బయలుదేరింది. అయితే చైనా ఓడ తన జలాల్లో ఎటువంటి పరిశోధనలు చేయబోదని మాల్దీవులు గతంలో తెలిపింది. కానీ ఈ నౌక మాల్దీవులు శ్రీలంక జలాల్లోనూ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రభావం విస్తరిస్తుండటంతో ఆందోళన చెందుతోంది.
దెబ్బతిన్న భారత్-మాల్దీవుల సంబంధాలు
గతేడాది చివరలో మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులలోని భారత దళాలను ఉపసంహరించుకోవాలని తెలిపారు. అంతేగాక చైనాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు. మే నాటికి భారత దళాలను ఉపసంహరించుకోవడంపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి ఆ దేశంలో పలు సవాళ్లకు కూడా దారితీసింది. చైనా అనుకూల విధానంపై పలువురు మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు ముయిజ్జూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చైనా నౌక మాల్దీవులకు చేరుకోవడం గమనార్హం.