- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bihar: వ్యక్తి శరీర భాగాల్లో కారం వేసిన ఘటనపై తేజస్వి యాదవ్ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దొంగతనం చేశాడనే నెపంతో అరారియాలోని ఇస్లాంనగర్‌లో స్థానికులు ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి, అతని ప్రైవేట్ శరీర భాగాల్లో కారం నింపి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన కాస్త వైరల్‌గా మారడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మహ్మద్ సిఫాత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీడియోలో సదరు వ్యక్తి చేతులను వెనుకకు కట్టేసి, నిందితుల్లో ఒకరు బాధితుడి వీపుపైన, శరీర భాగాల్లో కారం నింపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు, ఈ ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. బీహార్‌లో జరిగిన ఈ ఘటన తాలిబన్ రాజ్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించి అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.