శిశువులకు లింగమార్పిడి సర్జరీలు.. ‘సుప్రీం’కు చేరిన ఇష్యూ

by Hajipasha |
శిశువులకు లింగమార్పిడి సర్జరీలు.. ‘సుప్రీం’కు చేరిన ఇష్యూ
X

దిశ, నేషనల్ బ్యూరో : నవజాత శిశువులకు లింగ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడంపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై న్యాయపరమైన జోక్యానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నోటీసులు జారీ చేశారు.ఈ కేసు విచారణలో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సహాయాన్ని కోరారు.‘‘నవజాత శిశువులకు అభం శుభం తెలియదు. అలాంటి దశలోని పసికందులకు లింగ మార్పిడి సర్జరీలు చేస్తుండటం ఆందోళనకరం. ఇలా చేయడం శిక్షార్హమైన నేరం. వీటిని అరికట్టేందుకు సమగ్ర చట్టం ఉండాలి’’ అని సుప్రీకోర్టును పిటిషనర్ కోరారు. ఇలాంటి శస్త్రచికిత్సలపై 2019 సంవత్సరంలోనే తమిళనాడు రాష్ట్రం నిషేధం విధించిందని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed