ముంబై ఎఫెక్ట్ కారణంగా అప్రమత్తమైన చెన్నై!

by Ramesh Goud |
ముంబై ఎఫెక్ట్ కారణంగా అప్రమత్తమైన చెన్నై!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై ప్రమాదం ఎఫెక్ట్ కారణంగా అప్రమత్తం అవుతున్న అధికారులు చెన్నైలో ముందస్తు చర్యలు చేపట్టారు. ముంబైలో గాలి వానల కారణంగా 120x120 అడుగుల అక్రమ హోర్డింగ్ కూలిపోయింది దీని కింద చిక్కుకొని ఇప్పటివరకు 16 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నై నగరంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులనే కాక ఎక్కువ ఎత్తులో ఉన్న చిన్న హోర్డింగులను సైతం తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 460 అనధికార హోర్డింగ్ లను తొలగించింది. వాటితో పాటు నిర్మాణం, 30 అడుగుల కంటే ఎత్తు పై ఉన్న మరో 250 హోర్డింగ్ లను కూడా తీసివేసింది. అంతేగాక హోర్డింగ్ లు ఏర్పాటు చేసుకునేందుకు కార్యలయానికి ఇప్పటివరకు వచ్చిన 1,100 దరఖాస్తుల్లో 40 హోర్డింగ్ దరఖాస్తులను తిరిస్కరించామని, మిగిలిన వాటికి కూడా లైసెన్స్ ఇవ్వకుండా నిలుపుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed