- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి దొంగను పట్టుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి ఫ్లాస్క్‌లో బంగారం తరలింపు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత ఉంటుంది. కానీ చెన్నై విమానాశ్రయ పోలీసులు మాత్రం ఇంటి దొంగను పట్టుకుని.. అతడి వద్ద నుంచి బంగారం రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై విమానాశ్రయంలో ఒకే రోజు రూ.2 కోట్ల విలువైన 3.05 కిలోల బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించి ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగి సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న మణికందన్ (28) సోమవారం ఉదయం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని అంతర్జాతీయ టెర్మినల్ డిపార్చర్ ఏరియాలో చేతిలో ఫ్లాస్క్‌తో బయటకు వస్తూ కనిపించాడు. ఆ సమయంలో సెక్యూరిటీ అధికారులు మణికందన్‌ను ఆపి విచారించారు. మణికందన్ చేతిలో ఉన్న ఫ్లాస్క్‌ని తెరవగా అందులో రూ.92 లక్షల విలువైన 1.4 కిలోల బంగారు కడ్డీలు చూసి షాక్ అయ్యారు. బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో, మణికందన్ మాట్లాడుతూ.. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు ఫ్లాస్క్‌ను అందజేసి, విమానాశ్రయం యొక్క అరైవల్ ఏరియా వెలుపల నిలబడి ఉన్న వ్యక్తికి ఇవ్వమని కోరాడు. అనంతరం సీసీటీవీ ఫుటేజీ సాయంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వివరాలను అధికారులు విచారిస్తున్నారు.
అలాగే దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చే వారిని తనిఖీలు చేయగా.. టూరిస్టు వీసాపై వచ్చిన వ్యక్తి షూలో రూ. 85 లక్షల విలువైన బంగారం సీజ్ చేశారు. అదేవిధంగా బ్యాంకాక్ నుంచి వచ్చిన 40 ఏళ్ల మహిళ వద్ద రూ.23 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుని, ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.