‘గామిని’ చిరుత.. కునో నేషనల్ పార్క్‌లో తన 5 కూనలతో వర్షంలో ఆటలు

by Ramesh N |
‘గామిని’  చిరుత.. కునో నేషనల్ పార్క్‌లో తన 5 కూనలతో వర్షంలో ఆటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణాఫ్రికా చిరుత ‘గామిని’ తన ఐదు కూనలతో శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వర్షాన్ని ఆస్వాదించింది. ఈ సందర్భంగా గామిని తన పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. కూనలు కూడా సరదా చేష్టలతో చాలా అందంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తాజాగా వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో తాజాగా నెటిజన్లను ఆకర్షిస్తోంది.

కాగా, గతంలో కేంద్ర ప్రభుత్వం గామిని అనే ఆడ చిరుతను దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్‌ రిజర్వ్‌ నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిరుత ఈ ఏడాది మార్చి 10న ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయతే, చీతాల పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ కింద నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మొత్తం 20 చీతాల్ని భారత్‌కు తీసుకు రాగా.. వాతావరణం అనుకూలించక కొన్ని చిరుతలు మృత్యువాత పడ్డ విషయం విదితమే.

Advertisement

Next Story

Most Viewed