- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Electric shock: మొహర్రం వేడుకల్లో అపశృతి!.. హైటెన్షన్ లైన్ తగిలి ఇద్దరు మృతి, పది మందికి పైగా గాయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: మొహర్రం ఊరేగింపు వేడుకల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి చెందగా.. మరో పది మందికి పైగా గాయాలయ్యాయి. లకీంపూర్ ఖేరీ జిల్లా అమీర్ నగర్ ప్రాంతంలోని గర్దహా గ్రామంలో మొహర్రం ఊరేగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో 180 అడుగుల ఎత్తైన భారీ తజియాను బయటకు తీశారు. ఈ తజియాను దాదాపు 100 మంది మనుషులు మోసుకెళుతూ.. ఊరేగింపు చేస్తున్నారు. ఈ సమయంలోనే తజియా గోపురం గ్రామంలో ఉన్న 33 కేవీ హైటెన్షన్ లైన్ ను ఢీ కొట్టింది.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. మరో పది మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో ఒకరు అదే గ్రామానికి చెందిన శంషాద్ కుమారుడు హసీబ్(21) గా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియరాలేదన్నారు. ఘటనకు కారణం తజియా ఎత్తుగా ఉండమేనని పోలీసులు వెల్లడించారు.