- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చండీగఢ్ మేయర్ ఎన్నిక వాయిదా: ఆప్, కాంగ్రెస్ నిరసన
దిశ, నేషనల్ బ్యూరో: గురువారం జరగాల్సిన చండీగఢ్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నామినేట్ చేసిన అనిల్ మానిహ్ ఆరోగ్య పరిస్థితి దృష్యా ఎలక్షన్‌ను పోస్ట్ పోన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు కౌన్సిలర్లకు మెసేజ్ పంపించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మున్సిపల్ కార్యాలయానికి రావొద్దని సూచించారు. దీంతో ఆఫీస్ ఎదుట కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికలు వాయిదా పడతాయనే విషయం బీజేపీకి ముందే తెలుసని ఆరోపించాయి. కాగా, 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14, ఆప్‌కు 13, కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌కు సభలో ఒక కౌన్సిలర్ ఉన్నారు. మేయర్ సీటు కోసం ఆప్ పోటీ పడుతుండగా.. డిప్యూటీ మేయర్ పదవికి కాంగ్రెస్ పోటీ పడుతోంది. ‘బీజేపీ ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను వాయిదా వేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ప్రిసైడింగ్ అధికారిని మార్చాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సాల్ అన్నారు.