Champai Soren: బీజేపీలో చేరే ప్రసక్తే లేదు.. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్

by vinod kumar |
Champai Soren: బీజేపీలో చేరే ప్రసక్తే లేదు.. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్స్‌కు ముందు ఆ రాష్ట్ర మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడు చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్టు కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. తనపై వచ్చిన పుకార్లను ఖండించారు. శనివారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. బీజేపీలో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ తరహా వార్తలను ఎవరు సృష్టిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. జేఎంఎంలోనే కొనసాగుతానని తెలిపారు.

కాగా, భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 31న అరెస్టు చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం హేమంత్ బెయిల్ పై బయటకు రాగా సీఎం పదవికి రిజైన్ చేశారు. దీంతో అప్పటి నుంచి చంపై సొరెన్ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న చంపై తాజాగా వాటిని కొట్టిపారేశారు. మరోవైపు అసోం సీఎం హిమంత బిస్వశర్మ స్పందిస్తూ..జేఎంఎం అగ్రనేతలెవరూ బీజేపీతో టచ్‌లో లేరని తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు ఏదైనా జరగొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed