'జేఎంఎం'కు చంపై సోరెన్ రాజీనామా

by M.Rajitha |
జేఎంఎంకు చంపై సోరెన్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ఆ పార్టీని వదిలి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయన్న చంపై.. రాజకీయలకు గుడ్ బై చెప్పడం, కొత్త పార్టీ పెట్టడం, వేరే వాళ్ళతో కలిసి పనిచేయడం అని తెలిపారు. అటు తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లేదంటూ తేల్చి చెప్పిన కొద్ది రోజులకే.. ఆగస్టు 30న బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా బుధవారం జేఎంఎం పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్ర యశ్వంత్ సిన్హా తన కుమారుల రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కొత్త పార్టీ పెట్టబోతునట్టు ప్రకటించారు. ఎన్నికల వరకు ఇంకెన్ని మార్పులు జరుగుతాయో అని ఇటు రాజకీయాల్లో అటు ప్రజల్లో చర్చ మొదలైంది.

Next Story

Most Viewed