Indian Economy: భారత వృద్ధికి అడ్డంకిగా అంతర్జాతీయ సవాళ్లు: ఎకనమిక్ సర్వే

by S Gopi |   ( Updated:2024-10-28 15:03:41.0  )
Indian Economy: భారత వృద్ధికి అడ్డంకిగా అంతర్జాతీయ సవాళ్లు: ఎకనమిక్ సర్వే
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి స్థిరంగా మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనక తప్పదని ప్రభుత్వ నివేదిక అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రధాన ఆర్థికవ్యవస్థలు అనుసరిస్తున్న వాణిజ్య విధానాల విషయంలో భారత ఆర్థికవ్యవస్థ ఎక్కువ ప్రభావితమవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి 6.5-7 శాతం మధ్య ఉండనున్నట్టు సోమవారం విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, ప్రపంచ ఆర్థిక విచ్ఛిన్నం వల్ల ఆర్థిక మార్కెట్లలో వాల్యుయేషన్‌లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితుల వల్ల దేశంలో ప్రజలు ఖర్చు చేసే విధానం తగ్గవచ్చని నివేదిక తెలిపింది. అయితే, ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ దేశంలో వ్యవసాయ రంగం నుంచి లభిస్తున్న మద్దతు, పండుగ సీజన్ డిమాండ్ కారణంగా వృద్ధికి ఢోకా ఉండదని నివేదిక వెల్లడించింది. గ్రామీణ డిమాండ్ కూడా మెరుగుపడుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం సైతం నియంత్రణ పరిధిలోనే ఉందని, రానున్న రోజుల్లో కూరగాయ ధరలు పెరిగే అవకాశాలు లేవని నివేదిక వివరించింది.

Advertisement

Next Story

Most Viewed