Kolkata tragedy: వైద్యుల భద్రత కోసం సాధ్యమయ్యే చర్యలు తీసుకుంటాం

by Shamantha N |
Kolkata tragedy: వైద్యుల భద్రత కోసం సాధ్యమయ్యే చర్యలు తీసుకుంటాం
X

దిశ, నేషనల్ బ్యూరో: వైద్యసిబ్బంది భద్రత కోసం సాధ్యమయ్యే చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వైద్య వృత్తిలో ఉన్నవారి భద్రత గురించి కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని తెలిపింది. వైద్యులు చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నామని శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, కమిటీకి తమ సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాలను కూడా కోరింది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఆరోగ్యసిబ్బందిపై హింస సాధారణంగా మారిందని కేంద్రం పేర్కొంది. వైద్యసిబ్బంది విధినిర్వహణలో శారీరక హింస, బెదిరింపులకు గురవుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. వైద్యసిబ్బందిపై హింసకు పాల్పడితే ఆరుగంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం సూచించింది. నిర్ణీత వ్యవధిలోగా ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయడానికి ఆసంస్థ యాజమాన్యం బాధ్యత వహించాలని ప్రభుత్వం పేర్కొంది.

దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మే

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన (Doctors strike) చేపడుతున్నారు. విధులను బహిష్కరించి ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపేమేరకు 24 గంటల పాటు డాక్టర్లు సమ్మేకు దిగారు. వైద్యసేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేంద్రం స్పందించింది. నిరసన చేస్తున్న వైద్యులు తక్షణమే ఆందోళన విరమించాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed