Chief Justices : ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

by Hajipasha |
Chief Justices : ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను శనివారం రోజు నియమించారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మన్మోహన్‌ను పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజీవ్ శాఖ్దర్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ నితిన్ మధుకర్ జమ్దార్‌ను కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ కేఆర్ శ్రీరాం.. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.

కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. జమ్మూకశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు జడ్జి జస్టిస్ తశీ రబ్‌స్తాన్‌‌కు అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.

Next Story

Most Viewed