- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓటర్ ఐడీ - ఆధార్ కార్డు అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఓటర్ ఐడీ(Voter ID)తో ఆధార్(Aadhaar Card) అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునకు అనుగుణంగా ఆధార్‌తో ఓటర్ కార్డు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మంగళవారం పలుశాఖల ముఖ్య కార్యదర్శులతో సీఈసీ సమావేశమైంది. దేశమంతా ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్(Election Commission) అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించొచ్చని ఈసీ అభిప్రాయపడింది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ అనుసంధానమయితేనే ఇక నుంచి ఓటింగ్‌కు ఇక అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు రిగ్గింగ్ వంటివి జరిగే ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుందని పేర్కొంది. దీంతో ఈసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. నకిలీ ఓటరు జాబితా ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని పలు పార్టీలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఓటరు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే ఈ సమస్యలు అన్నింటికి చెక్ పెట్టొచ్చని భావించి.. కేంద్రం ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.