నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 10 లక్షల ఉద్యోగాలు

by M.Rajitha |
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 10 లక్షల ఉద్యోగాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం కేంద్ర కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు నిరుద్యోగులకు వరమయ్యాయి. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు దేశంలో 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక నగరాల వలన రానున్న రోజుల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. 10 రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్న 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.28,602 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ భారీ పెట్టుబడుల వలన ప్రత్యక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరకుతాయని తెలియ జేశారు. అంతే కాకుండా ఈ పారిశ్రామిక కారిదార్లు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తాయని మంత్రి అన్నారు. ఈ స్మార్ట్ పారిశ్రామిక నగరాల్లో తెలంగాణలోని జహీరాబాద్ కూడా ఉంది.

Next Story

Most Viewed