కేంద్ర బడ్జెట్‌లో షాకింగ్ నిర్ణయం పెరగనున్న ఈ వస్తువుల ధరలు

by Mahesh |   ( Updated:2024-07-23 08:43:24.0  )
కేంద్ర బడ్జెట్‌లో షాకింగ్ నిర్ణయం పెరగనున్న ఈ వస్తువుల ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటిని 25 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే టెలికాం పరికరాలపై కస్టమ్స్ డ్యూటి 10 నుంచి 15 శాతానికి పెంచారు. ఫెర్టిలైజర్, పురుగుల మందుల తయారీలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ పై కస్టమ్స్ డ్యూటిని పెంచింది. దీంతో రానున్న రోజుల్లో ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువుల ధరలు పెరుగుదలకు అవకాశం ఉంది. అలాగే పర్టిలైజర్స్, ఇతర పురుగుల మందుల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.


Click Here For Budget Updates!

Advertisement

Next Story