వక్ఫ్ బోర్డ్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
వక్ఫ్ బోర్డ్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ బోర్డ్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్‌బోర్డు బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయించింది. విపక్షాల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్‌‌బోర్డ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్‌ బోర్డు అధికారాలను పరిమితి చేయడంతో పాటు.. ముస్లిం మహిళలను సభ్యులుగా చేసేలా సవరణలు చేశారు. అనంతరం దీనిపై కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. సచార్ కమిటీ సిఫార్సులు ఈ బిల్లులో పెట్టామని.. ముస్లిం మహిళలు, పిల్లలకు చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డులకు రావాల్సిన ఆదాయం రావడం లేదని.. సచార్ కమిటీ కూడా చెప్పిందని కిరణ్ రిజిజు గుర్తుచేశారు. అలాగే వక్ప్‌బోర్డు ఆదాయాలపై అందరికీ అవగాహన ఉందని.. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని తాము చేసి చూపించామని, కాంగ్రెస్ ఇతర పార్టీలు రాజకీయం కోసమే బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కానీ తాము ముస్లింలకు న్యాయం చేయడానికి ఈ బిల్లును సవరించామని ఆయన సభలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed