దేశంలో కరోనా ముగియలే.. ఆ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

by Satheesh |   ( Updated:2023-04-21 13:42:20.0  )
దేశంలో కరోనా ముగియలే.. ఆ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులను నిశితంగా గమనించాలని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తిని సూచింస్తోందని అన్నారు.

అందువల్ల ప్రతి 100 టెస్టులకు పెరుగుతున్న పాజిటివ్ రేటు, ఇన్ఫెక్షన్ పరిస్థితిపై దృష్టి సారించాలని ఈ ఎనిమిది రాష్ట్రాలను కేంద్రం కోరింది. పాజిటివ్ కేసులను ప్రారంభ దశలోనే నియంత్రించడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించాలని సూచించారు. కోవిడ్ తో పాటు ఇన్ ఫ్లూఎంజా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ కేసుల పోకడలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

Advertisement

Next Story

Most Viewed