కేంద్ర ఉద్యోగులు అలా చేస్తే.. వేతనంలో కోత ?

by Hajipasha |
కేంద్ర ఉద్యోగులు అలా చేస్తే.. వేతనంలో కోత ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆఫీసుకు లేటుగా వెళ్లే కేంద్ర పభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. అలాంటి వారిని గాడిన పెట్టే దిశగా మోడీ సర్కారు దిద్దుబాటు చర్యలను చేపట్టబోతోంది. ఇందుకోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుందని పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొత్త రూల్‌ ప్రకారం.. ఉద్యోగులు రోజూ ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆఫీసు విధుల్లో ఉండాలి. ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్‌ ఇస్తారు. ఉద్యోగి ఆ గ్రేస్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత ఆఫీసుకు వస్తే హాఫ్‌ డే‌ను సెలవుగా పరిగణిస్తారు. అయితే ప్రతినెలా రెండు రోజుల పాటు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. రెండు రోజులకు మించి గ్రేస్‌ పీరియడ్‌‌కు మించి ఆఫీస్‌కు లేటుగా వస్తే ఒక్కోరోజు హాఫ్‌ డే వేతనం చొప్పున కోత విధిస్తారు. అయితే సదరు ఉద్యోగికి క్యాజువల్‌ లీవులు (సీఎల్‌లు) ఉంటే వాటి నుంచి హాఫ్‌ డే లీవును మినహాయిస్తారు. క్యాజువల్‌ లీవులు లేకపోతే ఎర్న్‌డ్ లీవుల (ఈఎల్‌లు) నుంచి తగ్గిస్తారు. అవి కూడా లేకపోతే వేతనంలో కోత విధిస్తారు. ఆలస్యంగా ఆఫీసుకు వచ్చే వాళ్లకే కాకుండా ఎర్లీగా ఆఫీసు నుంచి వెళ్లిపోయే వాళ్లకూ ఈ నియమం వర్తిస్తుందట.

Advertisement

Next Story

Most Viewed