రాహుల్ యాత్రలో పాల్గొన్న మాజీ ఐఏఎస్‌పై CBI కేసు నమోదు!

by GSrikanth |   ( Updated:2023-01-13 06:22:00.0  )
రాహుల్ యాత్రలో పాల్గొన్న మాజీ ఐఏఎస్‌పై CBI కేసు నమోదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవిద్ మాయారాంపై సీబీఐ కేసు నమోదు చేసింది. భారతీయ కరెన్సీ నోట్లకు ఉపయోగించే ప్రత్యేకమైన కలర్ షిఫ్ట్ సెక్యూరిటీ థ్రెడ్ సరఫరా విషయంలో జరిగిన ఒప్పందంలో అవినీతి జరిగిందన్న ఆరోపణల కేసులో గురువారం సీబీఐ కేసు నమోదు చేసింది. అంతకు ముందు జైపూర్, ఢిల్లీలోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లకు అవసరమై ప్రత్యేక ఆకుపచ్చ రంగు సెక్యురిటీ థ్రెడ్ సరఫరా కాంట్రాక్టును బ్రిటన్‌కు చెందిన 'దె ల రూ ఇంటర్నేషనల్ లిమిటెడ్'కు లబ్ధి చేకూరేలా అరవింద్ మాయారాంతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని గుర్తు తెలియని వ్యక్తుల కుట్రలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ లో సీబీఐ అభియోగాలు మోపింది. ఈ వ్యవహారం అంతా 2014 నుంచి 2013 మద్య కాలంలో జరిగిదని పేర్కొంది. ఆర్థిక కార్యదర్శి హోదాలు మాయారం అక్రమ పద్దతిలో హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే సరఫరా కాంట్రాక్టును పొడిగించారని ఆరోపించింది.

రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న కొద్ది రోజుల్లోనే కేసు:

1978 బ్యాచ్ మాజీ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ మాయారంపై సీబీఐ కేసు విషయంలో ఆసక్తికర అంశం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో అరవిద్ మాయారాం తన భార్యతో కలిసి రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో పాల్గొన్న నెల రోజులకే ఆయన నివాసంలో సోదాలు జరగడం, కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More...

శరద్ యాదవ్ కు ప్రముఖుల నివాళి

Advertisement

Next Story

Most Viewed