- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లంచం కేసులో నేషనల్ హైవేస్ అథారిటీ జనరల్ మేనేజర్ అరెస్ట్
by S Gopi |
X
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లంచం తీసుకున్న కేసులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) జనరల్ మేనేజర్ అరెస్ట్ అయ్యారు. రూ. 20 లక్షల లంచం తీసుకున్న కారణంగా ఎన్‌హెచ్ఏఐ జీఎం, ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కాలేను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఆయన ఈ లంచం తీసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టు తర్వాత జరిపిన సోదాల్లో లంచంగా తీసుకున్న రూ.20లక్షలతో పాటు మొత్తం రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి అరవింద్ కాలేతో పాటు లంచం ఇచ్చిన ప్రైవేటు కంపెనీ, మరో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story