వివాదంలో విరాట్ కోహ్లీ పబ్.. కేసు నమోదు

by Shamantha N |
వివాదంలో విరాట్ కోహ్లీ పబ్.. కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ మరోసారి వివాదంలో చిక్కకుంది. బెంగళూరులోని వన్ 8 కమ్యూన్ పబ్‌పై కేసు నమోదైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఎండీ రోడ్ లో ఈ పబ్ ఉంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 1.30 గంటల వరకు పబ్ నిర్వహించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వన్ 8 కమ్యూన్ సహా పలు పబ్ లపై కేసు నమోదు చేయడంపై సెంట్రల్‌ డీసీపీ స్పందించారు. అర్ధరాత్రి వరకు పబ్‌ ఓపెన్‌ చేసి ఉండడం, పెద్ద శబ్దాలతో మ్యూజిక్‌ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానికులు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో సాధారణంగా పబ్‌ కార్యకలాపాలు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉందన్నారు. కానీ, సమయం దాటిన తర్వాత కూడా పబ్ లను నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వన్ 8 కమ్యూన్ పబ్ చుట్టూ వివాదాలు

గతేడాది ముంబై వన్‌8 కమ్యూన్‌ పబ్ వార్తల్లో నిలిచింది. తమిళనాడుకి చెందిన ధోతి ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, పబ్ సిబ్బంది అతడ్ని లోపనలికి అనుమతించలేదు. పబ్ సిబ్బంది కస్టమర్ల మనోభావాల్ని పట్టించుకోవట్లేదని ఆ వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గతేడాది కోహ్లి పబ్ ను కాపీరైట్‌ వివాదం చుట్టుముట్టింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (పీపీఎల్) కాపీరైట్‌ ఉన్న పాటలను పబ్ లో ప్లే చేయకుండా నిషేధం విధించింది.

Advertisement

Next Story

Most Viewed