అరుల్మిగు రామనాథస్వామి ఆలయం మర్చిపోలేను: ప్రధాని నరేంద్ర మోడీ

by samatah |
అరుల్మిగు రామనాథస్వామి ఆలయం మర్చిపోలేను: ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ పోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రుద్రాక్ష-మాల ధరించి, అగ్నితీర్థం బీచ్‌లో పవిత్ర స్నానం చేస్తున్న పోటోను షేర్ చేస్తూ..‘ఆలయంలోని ప్రతి భాగంలో కాలాతీత భక్తి ఉంది’ అని ట్వీట్ చేశారు. ఆలయ సందర్శనను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. అంతకుముందు ఉదయం మోడీ ధనుష్కోడి సమీపంలోని రామసేతు నిర్మించిన ప్రదేశం అరిచల్ మునైని సందర్శించారు.

Advertisement

Next Story