- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
27 వారాల గర్భాన్ని తొలగించలేం, పిండానికి జీవించే హక్కు ఉంది: సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: గర్భంలో ఉన్న పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని పేర్కొంటూ 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుమతిని తిరస్కరించింది. 20 ఏళ్ల అవివాహిత మహిళ వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 3న ఢిల్లీ హైకోర్టు సైతం ఇదే తరహా తీర్పును ఇచ్చిన నేపథ్యంలో సదరు మహిళ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 'మేము చట్టానికి విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వును ఇవ్వలేము. కడుపులో ఉన్న బిడ్డకు కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంది. దాని గురించి మీరేమంటారు?' అని న్యాయమూర్తులు ఎస్వీ ఎన్ భట్టి, సందీప్ మెహతా ఆమె న్యాయవాదిని ప్రశ్నించారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టం కేవలం తల్లి గురించి మాత్రమే మాట్లాడుతుందని మహిళ తరపు న్యాయవాది తెలిపారు. అయితే, మహిళ గర్భం దాల్చి ఏడు నెలలకు పైగా అయిందని, పిల్లలు జీవించే హక్కు గురించి ఏంటి? దాన్నెలా పరిష్కరిస్తారని బెంచ్ ప్రశ్నించింది. ఆమె మానసిక, శారీరక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది కోరగా, సుప్రీంకోర్టు కుదరదని పేర్కొంది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు సైతం చట్టబద్ధంగా 24 వారాల పరిమితి మించిపోవడంతో 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించబోమని వెల్లడించింది.