Eknath Shinde : ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడపలేం.. ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్‌నాథ్ షిండే సెటైర్లు

by Sathputhe Rajesh |
Eknath Shinde : ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడపలేం.. ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్‌నాథ్ షిండే సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో మహాయుతి కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ నమోదు చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం డిప్యూటీ సీఎంలు దేవేంద్ర పడ్నవీశ్, అజత్ పవార్లతో కలిసి ఆయన జాయింట్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 2019లో 54 మంది శివసేన అభ్యర్థులు గెలిచారని ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలతో తాము సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. కేవలం అభివృద్ధి చేసి సమాధానం చెప్పామన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇదే వివరించామన్నారు. ప్రజలతో కలిసి తామంతా పనిచేశామన్నారు.ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడపలేమన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేని ఉద్దేశించి అన్నారు. బాలసాహెబ్ ఠాక్రే ఆశయాలతో కొత్త ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. 2019లో ఇదే ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పలికారని కానీ అప్పడేం జరిగిందో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా ముందుంది అని రిజల్ట్స్ అనంతరం ఆయన అన్నారు. తాను ఒక ఆపరేషన్ చేశానని.. కుట్లు కూడా వేయకుండా ఆపరేషన్ జరిపానని షిండే అన్నారు. గతంలో శివసేన నుంచి 30 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన పై విధంగా కామెంట్స్ చేశారు. థానే జిల్లాలోని కొప్రి-పచ్ పకాడీ స్థానం నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర సీఎం షిండే మరో మారు లక్షా 20వేల 717 ఓట్లతో ఘన విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed