కెనడా ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్‌ హ్యాక్..

by Vinod kumar |
కెనడా ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్‌ హ్యాక్..
X

న్యూఢిల్లీ : కెనడా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. దీన్ని హ్యాక్ చేసింది తామేనంటూ ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యాకర్స్ గ్రూప్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. హ్యాక్ చేసిన కెనడా ఎయిర్ ఫోర్స్ వెబ్ సైట్‌లో వస్తున్న ఎర్రర్ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను కూడా మరో పోస్టులో షేర్ చేసింది. భారత్‌-కెనడా మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

హ్యాకింగ్ ప్రభావంతో చాలాసేపు కెనడా ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్ పని చేయలేదు. డెస్క్‌టాప్ వర్షన్‌లో వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పటికీ.. మొబైళ్లలో ఓపెన్ కాలేదు. దీంతో అలర్ట్ అయిన కెనడా సర్కారు.. ఈ సైట్‌‌ను వెంటనే ఐసోలేట్ చేసింది. ఈ హ్యాకింగ్ వల్ల పెద్ద సమస్యేమీ రాలేదని, ప్రభావం పడలేదని వెల్లడించింది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వెబ్ సైట్ మునుపటిలాగే పనిచేస్తోందని తెలిపింది. కెనడా భద్రతా బలగాలు ఈ హ్యాకింగ్‌పై విచారణ మొదలు పెట్టాయి.

Advertisement

Next Story