ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

by Sridhar Babu |
ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి
X

దిశ, ఆదిలాబాద్ : త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అర్హులైన వారు పేరు నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా బుధవారం పేర్కొన్నారు. ఇందుకు ఫారం నెంబర్ 18, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో తమ పేరు నమోదు కోసం ఫారం నెంబర్ 19 దరఖాస్తులు జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇందుకు నియోజకవర్గ పరిధిలో నివసిస్తూ ఉండేవారు, నవంబర్ 8వ తేదీ 2024 కన్నా మూడేళ్ల ముందు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులు అయినవారు అర్హులని తెలిపారు.

దరఖాస్తు చేసుకునే వారు పాస్ ఫొటో, ఆధార్, ఓటర్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, డిగ్రీ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరణ చేసుకొని ఉండాలని కోరారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం నియోజకవర్గ పరిధిలో నివసిస్తూ ఉండాలని, నవంబర్1, 2024 కన్నా ముందు 6 సంవత్సరాల నుంచి మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో బోధిస్తూ ఉన్నవారు అర్హులని, దరఖాస్తు ఫారంలో పాస్ ఫొటో, ఆధార్, ఓటర్ కార్డ్ జిరాక్స్ తో పాటు నివాస ధ్రువీకరణ పత్రం, సంబంధిత పాఠశాల ఉన్నతాధికారి నుంచి అనుబంధం 2లో ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోరారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోడానికి వచ్చే నెల ఆరవ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. ఇందుకు ఆయా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో కానీ, ఆన్లైన్లో కానీ తమ దరఖాస్తును పూర్తి చేసి,త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Next Story