Canada: కెనడాలో కాన్సులర్ క్యాంపులు రద్దు.. ఉద్రిక్తతల వేళ భారత్ కీలక నిర్ణయం

by vinod kumar |
Canada: కెనడాలో కాన్సులర్ క్యాంపులు రద్దు.. ఉద్రిక్తతల వేళ భారత్ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, (India) కెనడా (Canada)ల మధ్య దౌత్య విభేదాలు నెలకొన్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన కాన్సులర్ క్యాంపు (consular camps) లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. భద్రతా కారణాల దృష్యా ఈ డిసిషన్ తీసుకున్నట్టు టొరంటోలోని భారత కాన్సులేట్ కార్యాలయం గురువారం వెల్లడించింది. ‘కమ్యుూనిటీ క్యాంప్ నిర్వహకులకు రక్షణ కల్పించడంలో భద్రతా సంస్థలు విఫలమయ్యాయి. అందుకే గతంలో ప్రకటించిన కొన్ని క్యాంపులను రద్దు చేశాం. సభ్యుల సెక్యూరిటీ దృష్యా కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొంది. కాగా, ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల బ్రాంప్టన్ నగరంలోని హిందూ దేవాలయంపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడులు చేశారు. ఆలయంలోకి చొరబడి భక్తుల పై విరుచుకుపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజా దాడులకు కెనడా ప్రధాని టూడో, భారత ప్రధాని మోడీలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ కాన్సులర్ క్యాంపులను భారత్ రద్దు చేయడం గమనార్హం.

Advertisement

Next Story