Bihar Bypolls Results: బిహార్ ఉపఎన్నికల్లో అధికార ఎన్డీఏ హవా.. నాలుగు స్థానాల్లో ఘన విజయం

by Shamantha N |
Bihar Bypolls Results: బిహార్ ఉపఎన్నికల్లో అధికార ఎన్డీఏ హవా.. నాలుగు స్థానాల్లో ఘన విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని(Bihar Bypolls Election Results) నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో అధికార ఎన్డీఏ(NDA) ఘన విజయం సాధించింది. ఎన్డీఏ ఇమామ్‌గంజ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడనే కాకుండా ఇండియా కూటమి నుంచి మిగతా మూడు స్థానాలను దక్కించుకుంది. తరారీ(Tarari) అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన విశాల్ ప్రశాంత్, రామ్ గఢ్(Ramgarh) నుంచి బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్ ఘన విజయం సాధించారు. బేలాగంజ్(Belaganj) నుంచి జేడీ(యూ)కి చెందిన మనోరమా దేవి 21,391 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఇక, ఇమామ్ గంజ్(Imamganj) నుంచి హిందుస్థానీ అవామ్ మోర్చా అభ్యర్థి, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ కోడలు దీపా మాంఝీ విజయకేతనం ఎగురవేశారు. ఆర్జేడీ అభ్యర్థి రోషన్ కుమార్ పై 5 వేల ఓట్ల తేడాతో దీపా మాంఝీ గెలిచారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు..

వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు ఎన్డీఏ కూటమిలో జోష్ నింపాయి. ఇదిలా ఉంటే, ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జన్ సూరాజ్ పార్టీకి ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థులు ఒక సీటు మినహా అన్నింటిలో తమ డిపాజిట్లను కోల్పోయారు.

Next Story

Most Viewed