- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
By polls: యూపీ, పంజాబ్, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు.. కారణమిదే?
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్(Utharapradesh), పంజాబ్(Panjab), కేరళ(kerala) రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల(Assembly by polls) తేదీ మారింది. ఈ మూడు రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ (Polling) జరగనుండగా.. పోలింగ్ తేదీని 20వ తేదీకి మార్చినట్టు ఎన్నికల సంఘం(EC) సోమవారం వెల్లడించింది. యూపీలోని 9, పంజాబ్‌లోని 4, కేరళలోని 1 అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ జరగనుంది. నవంబర్ 13 నుంచి15 మధ్య కార్తీక మాసం సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు పోలింగ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని పోలింగ్ తేదీని మార్చినట్టు పేర్కొంది. కాగా, మహారాష్ట్ర-జార్ఖండ్‌తో పాటు 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 15న ఈసీ ప్రకటించింది.