- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral News: బస్సులో అధికారులకే దిక్కులేదు.. ఇక సామాన్యుల పరిస్థితి? వీడియో వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ రిటైర్డ్ ఐఏఎస్ (retired IAS officer) అధికారిపై బస్ కండక్టర్ దాడి (Bus conductor attacks) చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్ఎల్ మీనా బస్సులో రూ. 10 అదనపు ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించారు. దీంతో బస్సు కండక్టర్‌కు అధికారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రిటైర్డ్ అధికారి మొదట బస్ కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వెంటనే బస్ కండక్టర్ వృద్ధుడు అని చూడకుండా దాడికి పాల్పడ్డాడు. రిటైర్డ్ అధికారి పై కండెక్టర్ కాలుతో తన్నాడు. బస్సులో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు తాను దిగాల్సిన బస్‌స్టాప్ నుంచి ముందుకొచ్చారు. దీంతో బస్ కండక్టర్ నెక్స్ట్ స్టాప్ లో దిగాలని.. అందుకు రూ. 10 అదనంగా టికెట్ చార్జి చెల్లించాలని ఆ వృద్ధుడుని కోరాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కనోటా స్టేషన్ హౌస్ అధికారి ఉదయ్ సింగ్ తెలిపారు.
అయితే బస్ స్టాప్ వచ్చిందని కండక్టర్ రిటైర్డ్ అఫీసర్‌కు చెప్పడం మర్చిపోయాడని అన్నారు. దీంతో బస్సు నెక్స్ట్ స్టాప్ వద్దకు చేరుకోవడంతో కండక్టర్ రిటైర్డ్ ఆఫీసర్ మీనాను అదనపు చార్జీలు అడిగినప్పుడు వాగ్వాదం అయిందన్నారు. అప్పుడు కండక్టర్ మీనాను నెట్టడంతో కోపం వచ్చి కండక్టర్ చెంపపై ఒక దెబ్బ వేశాడని వివరించారు. కండక్టర్ కు తీవ్ర కోపం వచ్చి.. ఆ వృద్ధుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. కండక్టర్‌ను ఘనశ్యామ్ శర్మగా గుర్తించామని ఉదయ్ తెలిపారు. కనోటా పోలీస్ స్టేషన్‌లో శనివారం మీనా ఫిర్యాదు ఆధారంగా కండక్టర్ పై ఫిర్యాదు నమోదు అయింది. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, జైపూర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆ కండక్టర్‌ను స్పస్పెండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే వీడియో వైరల్ కావడంతో అధికారులకే దిక్కులేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.