Bus Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఐదుగురు వ్యక్తులు మృతి

by Ramesh Goud |
Bus Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఐదుగురు వ్యక్తులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ (Gujarat) లోని డాంగ్ జిల్లా (Dang district)లో ఆదివారం ఘోర ప్రమాదం (fatal accident) చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయ (valley)లో పడి ఐదుగురు మరణించగా (five people Death).. మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర (Maharashtra)లోని త్రయంబకేశ్వర్ (Trimbakeshwar) నుంచి గుజరాత్ లోని ద్వారక (Dwarka)కు యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ తెల్లవారుజామున సపుతర హిల్ స్టేషన్ (Saputara Hill Station) సమీపంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. దాదాపు 35 అడుగుల లోయలో పడిపోవడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయ్యింది.

ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 48 మంది ప్రయాణికులు (passengers) ఉన్నారు. ఇందులో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలు (seriously injured) అయ్యాయి. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాల (minor injuries)తో బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు (rescue operations) అందించారు. ప్రమాదంపై ఇంచార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (In Charge Superintendent of Police ) ఎస్‌జీ పాటిల్ (SG Patil) మాట్లాడుతూ.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడిందని, ఇందులో ఇద్దరు మహిళలు (two women), ముగ్గురు పురుషులు (three men died) మరణించారని తెలిపారు. అంతేగాక క్షతగాత్రులను అహ్వా (Ahwa)లోని ఆసుపత్రి (hospital)కి తరలించినట్లు పోలీస్ అధికారి (police official) చెప్పారు.

Next Story