Budget 2024: పెట్టుబడుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

by Mahesh |
Budget 2024: పెట్టుబడుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్:పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 48.21 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది.ఇందులో మొత్తం ఆదాయం రూ. 32.07 లక్షల కోట్లు కాగా పన్ను ఆదాయం రూ. 28.83 లక్షల కోట్లు, అలాగే అప్పులు పన్నేతర ఆదాయం రూ. 16 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అలాగే కొత్త ఐటీ స్లాబుల్లో మార్పులు చేసి.. ఉద్యోగులకు శుభవార్తను అందించింది. దీంతో పాటుగా పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్ ను రద్దు చేసింది. అలాగే విదేశీ కంపెనీలకు సంబంధించిన కార్పోరేట్ ట్యాక్స్ ను 40 శాతం నుంచి 35 శాతానికి కుదించింది. ఈ నిర్ణయంతో స్టార్టప్ లు, ఆన్‌లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడులను సమీకరించుకునే అవకాశాలు మెరుగవుతాయి. అలాగే తాజాగా కేంద్ర తీసుకున్న నిర్ణయంతో ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు అబ్ధి చేకూరనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పేద, మధ్య తరగతి, ఉపాధి కల్పన, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు ఆశాజనకంగా ఉందని చర్చించుకుంటున్నారు.



Next Story