BSP: బీఎస్పీ నేత దారుణ హత్య.. కారులో ప్రయాణిస్తుండగా కాల్చి చంపిన దుండగులు

by Ramesh Goud |
BSP: బీఎస్పీ నేత దారుణ హత్య.. కారులో ప్రయాణిస్తుండగా కాల్చి చంపిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానాలోని బీఎస్పీ నేత(BSP Leader) దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. కారులో ప్రయాణిస్తుండగా.. గుర్తు తెలియని దుండగులు ఆయనపై విచరక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్య గావించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి(Haryana BSP State Secretary) హర్ విలాస్ రజ్జుమాజరా(Har Vilas Rajju Majara) తన సన్నిహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా దుండగులు కారుపై కాల్పులు(Shoot) జరిపారు. ఈ ఘటనలో హర్ విలాస్ మరణించగా.. తన అనుచరులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి దగ్గరలోని సీసీటీవీ దృష్యాలు పరిశీలించగా.. అందులో కాల్పుల శబ్ధంతో పాటు కొంతమంది పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హర్ విలాస్ పై జరిగిన దాడిని బీఎస్పీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు ధరంపాల్ టిగ్రా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, కాల్పుల ఘటనలు సాధారణమైపోయాయి అని మండిపడ్డారు. కాగా బీఎస్పీ స్టేట్ సెక్రటరీగా ఉన్న హర్ విలాస్ రజ్జుమాజరా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబాలా పరిధిలోని నారాయణ్ గఢ్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Next Story