BSF Chief : జమ్మూ బార్డర్‌లో సైనిక సన్నద్ధతపై బీఎస్ఎఫ్ చీఫ్ సమీక్ష

by Hajipasha |
BSF Chief : జమ్మూ బార్డర్‌లో సైనిక సన్నద్ధతపై బీఎస్ఎఫ్ చీఫ్ సమీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల వరుస ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ బార్డర్ వద్ద బీఎస్ఎఫ్ సన్నద్ధతపై బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్(డీజీ) నితిన్ అగర్వాల్ ఆదివారం సమీక్షించారు. జమ్మూలో జరిగిన ఈ సమావేశంలో వెస్టర్న్ కమాండ్ బీఎస్ఎఫ్ ఎస్‌డీజీ వైబీ ఖురానియా, జమ్మూ బీఎస్ఎఫ్ ఐజీ డీకే బూర, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జమ్మూ సరిహద్దుల్లో ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఏ రకమైన వ్యూహంతో ముందుకుసాగాలనే దానిపై వారికి బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ దిశానిర్దేశం చేశారు.

సమన్వయంతో పనిచేస్తూ సరిహద్దుల్లో పకడ్బందీ పహారా ఉంచాలన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈనెల 20న జమ్మూకు చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ.. రెండో రోజు(ఆదివారం) పలువురు బీఎస్ఎఫ్ సిబ్బందిని కలిసి సంభాషించారు. వారి అంకితభావం, వృత్తి నైపుణ్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ నితిన్ అగర్వాల్ భేటీ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed